కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు

కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలలేదు. రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పీఆర్ టీయూ అభ్యర్థి చెన్నకేశవరెడ్డిపై 1500కు పైగా ఓట్ల ఆధిక్యంలో AVN రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  AVN రెడ్డి ముందంజలో ఉన్నారు. AVN రెడ్డిని బీజేపీ బలపరిచిన విషయం తెలిసిందే. రాత్రి ఒంటిగంట తర్వాతే ఫలితం వెలువడే అవకాశం ఉందంటున్నారు. 

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏవీఎన్ రెడ్డి, చెన్నకేశవరెడ్డిలకు భారీగా ఓట్లు వచ్చాయి. అయితే.. మొదటి ప్రాధాన్యతలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సుమారు రెండు వేలకు పైగా చెల్లని ఓట్లను గుర్తించారు. మరికాసేపట్లో రిటర్నింగ్ అధికారి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి .. మీడియా ప్రతినిధులకు వివరాలు తెలిపే అవకాశం ఉంది.