సెప్టెంబర్ 20 నుంచి డీఎస్సీ అప్లికేషన్లు.. టీఆర్టీ రోస్టర్ విడుదల

సెప్టెంబర్ 20 నుంచి డీఎస్సీ అప్లికేషన్లు.. టీఆర్టీ రోస్టర్ విడుదల

సెప్టెంబర్ 20 నుంచి టీచర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా 33 జిల్లాల వారిగా టీచర్ పోస్టులకు విద్యాశాఖ రోస్టర్ ఖాళీలను విడుదల చేసింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 21 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. 

డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించి జిల్లాల వారీగా రోస్టర్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా... కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేదు. సెప్టెంబర్ 15న దీనికి సంబంధించి రోస్టర్ విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. దీంతో పాటే.. సిలబస్, విద్యార్హత వంటి పూర్తి వివరాలు కూడా విడుదల చేస్తామన్నారు. కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ 19న విడుదల చేశారు.  

ALSO READ: కొత్త ఉద్యోగం వెతుకుతున్నారా.. ఇలా చేస్తే గ్యారంటీగా వస్తుంది

టీచర్ పోస్టులకు  దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 21 ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలు(https://schooledu.telangana.gov.in/ISMS/)వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. అందులోనే పూర్తి విద్యార్హతల వివరాలు ఉంటాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.