హైదరాబాద్, వెలుగు: టీచర్లకు మిడ్డే మీల్స్, టిఫిన్ కాదు.. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏలే కావాలని పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. చెన్నయ్య అన్నారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ టీచర్లు, ఉద్యోగుల అసలు సమస్యలను పక్కనపెట్టి ఎవరూ అడగని అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం సరికాదన్నారు.
మూడేళ్లు దాటినా కొత్త పీఆర్సీ అమలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. టీచర్లు అడగకపోయినా కేబినెట్‌లో మిడ్డే మీల్స్, టిఫిన్ అంశాలపై చర్చించడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య అని అన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, ఏరియర్స్‌ను వెంటనే విడుదల చేసి, కొత్త పీఆర్సీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
