హైదరాబాద్, వెలుగు: ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా టీచర్లు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆలిండియా టీచర్స్ యూనియన్స్ జేఏసీ(ఏఐజాక్టో) పిలుపు మేరకు సంఘాలకు అతీతంగా టీచర్లు నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్సీటీఈ వెంటనే జోక్యం చేసుకుని సీనియర్ టీచర్ల ఉద్యోగాలకు రక్షణ కల్పించాలన్నారు.
బడుల మూసివేత, విలీన ప్రక్రియను ఆపేయాలని, ప్రభుత్వ విద్యకు నష్టం చేసేలా ఉన్న జాతీయ విద్యావిధానాన్ని సమీక్షించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైమరీ స్కూల్ టీచర్లకు ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు యూఎస్పీసీ, జాక్టో తదితర సంఘాలు మద్దతు ప్రకటించాయి.
