టీచర్ల అరెస్ట్ .. పోలీస్ స్టేషన్లలో ఫుడ్ లేక ఇబ్బందులు

టీచర్ల అరెస్ట్ .. పోలీస్ స్టేషన్లలో ఫుడ్ లేక ఇబ్బందులు

ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన టీచర్లను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట, బొల్లారం, గోశామహల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే స్టేషన్లలో ఉదయం నుంచి ఇప్పటి వరకు చిన్న పిల్లలతో కలిసి నిరసనకు దిగారు.  కనీస భోజన వసతులు కల్పించలేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ లేకపోవడంతో తమ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని వాపోతున్నారు.  

అంతకుముందు స్పౌజ్ బదిలీలు చేపట్టాలని కోరుతూ టీచర్​ దంపతులు, పిల్లలతో కలిసి లక్డీకాపూల్‌‌‌‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌‌‌‌ను ముట్టడించారు. తమ ఆవేదనను సర్కారుకు తెలిపేందుకు మౌన దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి మాటే ముద్దు.. దంపతులు విడిగా వద్దు..’, ‘దంపతుల్ని కలపండి.. సీఎం మాటను నిలపండి’అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. భర్త ఒక జిల్లాలో, భార్య మరో జిల్లాలో విధులు నిర్వహించడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ల ఆందోళన నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫీసు ముందు పోలీసులు భారీగా మోహరించారు. చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ అయింది. నిరసనకు పర్మిషన్ లేదని పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా, టీచర్లు ప్రతిఘటించారు. ఈ క్రమంలో పోలీసులకు, టీచర్లకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పలువురు టీచర్లపై పోలీసులు చేయి చేసుకున్నారు. టీచర్ల పిల్లలు ఏడుస్తున్నా పోలీసులు పట్టించుకోకుండా అరెస్టు