టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు (టీమిండియా) హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ నియమించింది బీసీసీఐ. తన నిర్ణయాన్ని కొద్దిసేపటి క్రితం బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం హెడ్ కోచ్ గా ఉన్న రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్ తర్వాత ముగియనున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో రాహుల్  ద్రావిడ్ ను ఎంపిక చేసింది బీసీసీఐ. అనేక తర్జన భర్జనలు, విశ్లేషణల తర్వాత ద్రవిడ్ ఎంపికకు బీసీసీఐ మొగ్గు చూపింది. 
తన నియామకంపై రాహుల్ ద్రావిడ్ స్పందించి సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న కోచ్ రవిశాస్త్రి హయాంలో భారత జట్టు అద్భుతమైన విజయాలను సాధించిందని కొనియాడారు. ఇదే విజయపరంపరను  ఆటగాళ్లందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు రాహుల్ ద్రవిడ్.