IND vs AUS : టీమిండియా.. స్వదేశంలో వరుసగా టెస్టు సిరీస్లు గెలిచి రికార్డు

IND vs AUS : టీమిండియా.. స్వదేశంలో వరుసగా టెస్టు సిరీస్లు గెలిచి రికార్డు

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ విజయంతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. టీమిండియా సొంత గడ్డపై వరుసగా 16వ టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుంది. భారత్ స్వదేశంలో 2013 నుంచి వరుసగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, శ్రీలంక, ఆఫ్గనిస్థాన్ జట్లపై  సిరీసులు గెలిచింది. అంతేకాకుండా 2016 నుంచి 2023 వరకు వరుసగా 4 సార్లు ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ లు గెలిచింది. భారత్.. 30 ఏళ్లలో ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. 

2000 నుండి స్వదేశంలో 39 టెస్ట్ లు ఆడిన టీమిండియా 31 సిరీసుల్లో గెలిచింది. అత్యధికంగా స్వదేశంలో టెస్టు సిరీస్ లు గిలిచిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆసీస్ ఆడిన 41 సిరీసుల్లో 32 గెలిచింది.