
విశాఖపట్నం వేదికగా భారత్,ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోన్న రెండో వన్డే మ్యాచ్ లో టీమిండియా 117 పరుగులకే ఆలౌట్ అయింది. మిచెల్ స్టార్క్ 5 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ (31) టాప్ స్కోరర్‌గా కాగా.. అక్షర్ పటేల్ (29*), రవీంద్ర జడేజా (16), రోహిత్ శర్మ (13) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ కాకుండా అబాట్ 3, ఎల్లిస్ 2 వికెట్లు తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ గిల్ డకౌట్ అయ్యాడు. ఆ తరువాత టీమిండియా ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. రోహిత్ శర్మ(13), సూర్య కుమార్ యాదవ్ (0), రాహుల్ (9), హార్దిక్ పాండ్య (1) వరుసగా వెనుదిరిగడంతో టీమిండియా కష్టాల్లో పడింది. నిలకడగా ఆడుతూ కాస్త జట్టు స్కోర్ ను పెంచే పనిలో పడ్డట్టుగా కనిపించిన విరాట్ కోహ్లీ (31) కూడా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత మిగతా బ్యాట్స్ మెన్స్ త్వరగానే పెవిలియన్ బాట పట్టారు. చివరికి అక్షర్ పటేల్ ఒక్కడే (29*) నాటౌట్‌గా మిగిలాడు.