IND vs AUS : కష్టాల్లో టీమిండియా.. హార్దిక్, జడేజా ఆడితేనే..

IND vs AUS : కష్టాల్లో టీమిండియా.. హార్దిక్, జడేజా ఆడితేనే..

చెన్నై వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా చివరి వన్డే మ్యాచులో.. 270 పరుగుల లక్ష్య చేదనంతో బరిలోకి దిగిన టీమిండియా కష్టాల్లో పడింది. మంచి ఓపెనింగ్ పార్ట్ నర్షిప్ వచ్చినా.. టాప్ ఆర్డర్ కొంత రాణించినా సుధీర్గ పార్ట్ నర్షిప్ దక్కపోయే సరికి భారత్ కష్టాల్లో పడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (30,17 బంతుల్లో), శుభ్ మన్ గిల్ (37, 49 బంతుల్లో) రాణించారు. విరాట్ కోహ్లీ (54, 72 బంతుల్లో) ఇన్నింగ్స్ ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ, అనుకున్న పార్ట్ నర్షిప్ రాలేదు. ప్రస్తుతం జడేజా (16 *), పాండ్యా (39*) భారత్ గెలుపుకు కృషి చేస్తున్నారు. భారత్ 42 బంతుల్లో 54 పరుగులు చేస్తే సిరీస్ గెలుస్తుంది. 

సూర్య మళ్లీ:

టీమిండియా బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్ మళ్లీ నిరాశ పరిచాడు. అతన్ని నమ్మి మరో ఛాన్స్ ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మూడు వన్డేలు ఆడిన సూర్య.. అన్ని మ్యాచుల్లో గోల్డెన్ డక్ అయి అందరినీ నిరాశ పరిచాడు. మొదటి రెండు మ్యాచుల్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ, ఈ మ్యాచులో అగర్ బౌలింగ్ లో బోల్డ్ అయ్యాడు.