కామన్వెల్త్ గేమ్స్: ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా

కామన్వెల్త్ గేమ్స్: ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా

కామన్వెల్త్ గేమ్స్లో అమీతుమీ పోరుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. బార్బడోస్పై అద్బుత విజయం సాధించి..సెమీస్ చేరిన టీమిండియా..ఇంగ్లాండ్తో తలపడబోతుంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే పతకం దక్కే అవకాశం ఉంది. ఓడితే మాత్రం కాంస్య కోసం మరోసారి పోరాడాల్సిన పరిస్థితి ఎదురవనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడబోతున్నాయి. గెలుపే లక్ష్యంగా రెండు జట్లు బరిలోకి దిగనున్నాయి. 


భారత తుది జట్టు:
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), షపాలీ వర్మ,  స్మృతీ మంధాన,  జెమీమా రోడ్రిగ్స్), , తానియా బాటియా, దీప్తి శర్మ,  పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, స్నేహ్ రాణా, మేఘ్నా సింగ్, రేణుకా సింగ్

ఇంగ్లాండ్ తుది జట్టు: డానియెల్లె వ్యాట్, సోపియా సంక్షే. నటాలీ స్కివెర్ (కెప్టెన్), ఆమీ జోన్స్, మలా బౌచర్, అలైస్ కాఫ్సీ,  క్యాథరిన్ ప్రింట్, సోఫీ ఎక్లెస్టోన్, ప్రియ కెంప్, ఇన్సీ వాంగ్, సారా గ్లెన్