T20 World Cup: టీమిండియా ఓపెనర్లు తుఫాన్ బ్యాటింగ్.. కివీస్ బౌలర్లు బెంబేలు.. 

T20 World Cup: టీమిండియా ఓపెనర్లు తుఫాన్ బ్యాటింగ్.. కివీస్ బౌలర్లు బెంబేలు.. 

T20 World Cup: టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌ మ్యాచ్ లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడబోతున్నాయి. ఈ హైవోల్టెజ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు తుఫాన్ బ్యాటింగ్ చేస్తుంది. పోటాపోటీగా బౌండ్రీలు బాదుతున్న అభి, శాంసన్ పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండానే 92 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ కేవలం 18 బంతుల్లోనే అర్థ శతకం కొట్టగా, సంజు శాంసన్  33 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. 

కాగా తొలిసారి మెగా టోర్నమెంట్ లో ఆడుతున్న అభిషేక్ శర్మ సెమీస్ ఫైనల్ మ్యాచ్ వరకు వరుసగా విఫలమైన తర్వాత కూడా ఫైనల్ పోరులో అతడికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ చోటు కల్పించారు. దీంతో కీలకమైన ఫైనల్ మ్యాచులో ఫామ్‎లోకి వచ్చిన అభిషేక్  శర్మ ఈ మ్యాచ్ ప్రారంభం నుంచే అద్భుతమైన బ్యాటింగ్ తో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ లో 6 ఫోర్లు, 3 సిక్సులు కొట్టి 52 పరుగులు చేసిన తర్వాత రచిన్ రవీంద్ర బౌలింగ్ లో కీపర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు.  

మరో ఓపెనర్ సంజు శాంసన్ సైతం గత మ్యాచ్ లో ఎక్కడైతే పరుగులు ఆపాడో అక్కడి నుంచే మళ్లీ తన బ్యాటింగ్ ప్రారంభించాడు. 22 బంతులు ఆడిన చెట్టా (సంజు) 3 ఫోర్లు, 3 సిక్సులతో 38 పరుగులు చేశాడు. అభిషేక్, సంజు శాంసన్ మధ్య 98 పరుగులు భాగస్వామ్యాన్ని రచిన్ రవీంద్ర బ్రేక్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ బ్యాటింగ్ కి రావడంతోనే భారీ షాట్స్ ఆడుతున్నాడు. దీంతో 8 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 110/ 1గా ఉంది.