T20 World Cup: న్యూజిలాండ్పై పూనకాలే.. ఫైనల్లో శివమెత్తిన భారత బ్యాటర్లు.. కివీస్ టార్గెట్ ఎంతంటే..?

T20 World Cup: న్యూజిలాండ్పై పూనకాలే.. ఫైనల్లో శివమెత్తిన భారత బ్యాటర్లు.. కివీస్ టార్గెట్ ఎంతంటే..?

T20 World Cup: టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఫైట్ లో భారత జట్టు దూకుడైన బ్యాటింగ్ తో న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా  5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కి వచ్చిన ఇండియన్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ అర్థ శతకాలతో చెలరేగారు. వరుసగా విఫలమైతున్న అభిషేక్ ఫైనల్ మ్యాచ్ లో ఫామ్ అందుకున్నాడు. దీంతో అభి (21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 52 పరుగులు) తనదైన మార్క్ షాట్స్ తో జస్ట్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి రచిన్ రవీంద్ర బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి కీపర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.  

మరో ఓపెనర్ సంజు శాంసన్ తన దూకుడైన బ్యాటింగ్ తో వరుసగా మూడో ( వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్) మ్యాచ్ లో కూడా అర్థ శతకం కొట్టాడు. తన బ్యాటింగ్ లో ఫోర్ల కంటే సిక్సులే ఎక్కువగా ఉన్నాయి. కాగా జేమ్స్ నీషమ్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడగా బౌండరీ లైన్ వద్ద సబ్ స్టూట్ ఫిల్టర్ కోల్ మెక్‌కాంచీకి క్యాచ్ ఇచ్చి సంజు ( 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సులతో 89 పరుగులు) డగౌట్ కి వెళ్లిపోయాడు. అభిషేక్ శర్మ ఔట్ అయిన తర్వాత అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన ఇషాన్ కిషన్ సైతం ట్రేడ్ మార్క్ షాట్స్ తో ( 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 54 పరుగులు) హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత జేమ్స్ నీషమ్ బౌలింగ్ లో భారీ షాట్ కొట్టి మార్క్ చాప్మన్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0) మరోసారి తీవ్రంగా నిరాశ పర్చాడు. భారీ షాట్ ఆడబోయి రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.  

అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన హార్దిక్, తిలక్ వర్మ ఆచి తూచి బ్యాటింగ్ చేయడంతో 16,17 ఓవర్లలో టీమిండియా పరుగులు ప్రవాహం తగ్గిపోయింది. హార్దిక్ పాండ్యా కూడా ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. కేవలం 18 పరుగులు మాత్రమే చేసి హెన్రీ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. కాగా, చివరి ఓవర్ వేసిన జేమ్స్ నీషమ్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సులు, మూడు ఫోర్లు శివమ్ దూబే కొట్టడంతో 20 ఓవర్లలో భారత్ 255 పరుగులు చేసింది. కాగా జేమ్స్ నీషమ్ 4 ఓవర్లు వేసి 46 పరుగులు ఇచ్చి టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ని దెబ్బ కొట్టాడు. తన ఒకే ఓవర్లో సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వికెట్లను పడగొట్టాడు. రచిన్ రవీంద్ర, మ్యాచ్ హెన్రీ తలో ఒక వికెట్ తీసుకున్నారు.