
ఆసియా కప్ లో వరుస భారీ విజయాలతో సూపర్-4 కు క్వాలిఫై అయిన టీమిండియా.. మరో మైలురాయికి చేరువలో ఉంది. శుక్రవారం (సెప్టెంబర్ 19) ఇండియా vs ఒమన్ మ్యాచ్ తర్వాత ఇండియా కీలక మైలురాయిని దాటనుంది. గ్రూప్ ఏ లో ఒమన్ తో జాయెద్ క్రికెట్ స్టేడియంలో ఆసియా కప్ లో 12 మ్యాచ్ జరగనుంది.
ఒమన్ తో ఆడనున్న ఈ మ్యాచ్ తర్వాత ఇండియా.. 250 టీ20 గేమ్స్ ఆడిన జట్టుగా రికార్డు సృష్టించనుంది. T20 క్రికెట్ చరిత్రలో రెండవ అత్యధిక మ్యాచ్ లు ఆడిన టీం గా ఇండియా నిలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అత్యధిక టీ20 మ్యాచ్ లు ఆడిన జట్టుగా పాకిస్తాన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. పాక్ ఇప్పటి వరకు 275 టీ20 గేమ్స్ ఆడింది.
ఆసియా కప్-2025 లో ఇండియా దూసుకుపోతోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో వరుసగా రెండు విజయాలతో గ్రూప్ ఏ లో టాప్ జట్టుగా ఉంది. ఒమన్ పైన కూడా ఫామ్ కొనసాగిస్తుందని.. నామ మాత్రపు మ్యాచ్ గా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఒమన్ తో మ్యాచ్ నామమాత్రమేనా..?
ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ఒమన్ జట్టు... ఇండియాకు ఏమాత్రం పోటీ ఇస్తుందన్నది ఆసక్తికరం. గెలుపు, ఓటములు పక్కనబెడితే ఈ మ్యాచ్‌లో స్టార్లతో కూడిన టీమిండియాతో తలపడటమే ఆ టీమ్‌కు ఓ గొప్ప అవకాశం కానుంది. వచ్చే నెలలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఒమన్.. ఇండియా వంటి పటిష్టమైన జట్టుతో ఆడటం ద్వారా ఎంతో నేర్చుకోవాలని భావిస్తోంది.
కెప్టెన్ జతీందర్ సహా ఒమన్ టీమ్‌లో పలువురు ఇండియా సంతతి ప్లేయర్లు ఉండటం విశేషం. కాగా, ఈ టోర్నీలో పాకిస్తాన్, యూఏఈతో జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లో ఒమన్ బ్యాటర్లు పూర్తిగా ఫెయిలయ్యార్లు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి ఒక్క బ్యాటర్ కూడా 30 రన్స్ మార్కును దాటలేకపోయాడు. అయితే, లెఫ్టార్మ్ స్పిన్నర్ షకీల్ అహ్మద్‌పై ఒమన్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ టోర్నీలో షకీల్ పవర్‌ప్లేలో కేవలం 3.50 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అయితే ఇండియా బ్యాటర్లకు తను ఏ మేరకు పోటీనిస్తాడో చూడాలి. ఇక, దుబాయ్‌తో పోలిస్తే అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం పిచ్ స్పిన్నర్లకు అంతగా అనుకూలించదు. ఇండియా, ఒమన్ తమ తుది జట్లలో మార్పులు చేసే అవకాశం ఉంది.