
డబ్లిన్ : టీమిండియా ఈ ఏడాది ఆగస్టులో ఐర్లాండ్ టూర్‌కు వెళ్లనుంది. ఆతిథ్య ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో పాల్గొంటుంది. ఆగస్టు 18-–23 మధ్య ఈ మూడు మ్యాచ్‌లు మలహిడేలో జరుగుతాయని క్రికెట్ ఐర్లాండ్ శుక్రవారం ప్రకటించింది. గతేడాది ఐర్లాండ్‌లో ఇండియా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఆ సిరీస్‌లో హార్దిక్ పాండ్యా తొలిసారి టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ ఐర్లాండ్ పంపే అవకాశం ఉంది.