టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 పోరు షురూ

టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 పోరు షురూ

టీ20 వరల్డ్ కప్ లో అసలైన ఫైట్ కు అంతా రెడీ అయ్యింది. ఇవాళ్టి నుంచి సూపర్–12 మ్యాచ్ లు మొదలవనున్నాయి. రెండు గ్రూప్స్ లో ఆరు టీమ్స్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. అయితే జింబాబ్వే తొలిసారిగా సూపర్–12కి అర్హత సాధించింది. మరోవైపు రెండు సార్లు చాంపియన్ గా నిలిచిన విండీస్ ను ఐర్లాండ్ ఇంటిముఖం పట్టింది. దీంతో గ్రూప్ A నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్.. గ్రూప్ B నుంచి జింబాబ్వే ఐర్లాండ్ సూపర్–12కు అర్హత సాధించాయి. లాస్ట్ ఇయర్ 12కు చేరిన విండీస్, నమీబియా, స్కాట్లాండ్ లకు ఈసారి టోర్నీలో చుక్కెదురైంది. 

ఇవాళ గ్రూప్–1లో భాగంగా..ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తలపడుతోంది. లాస్ట్ ఇయర్ జరిగిన టీ–20 ఫైనల్స్ లో రెండు జట్లు తలపడగా.. అప్పుడు ఆసీస్ గెలిచింది. అయితే ఇప్పుడు ఆదే మరోసారి సత్తా చాటేందుకు రెండు జట్లు రెడీ అవుతున్నాయి. 2011 నుంచి ఏ ఫార్మాట్ లోనూ సొంత గడ్డపై ఆసీస్  టీమ్ కివీస్  చేతిలో ఓడిపోలేదు. మరోమ్యాచ్ లో ఆప్ఘానిస్థాన్ తో ఇంగ్లండ్ తలపడనుంది. 

గ్రూప్–2లో టీమిండియా నాకౌట్ కు వెళ్లేందుకు మరింత ఈజీ కానుంది. గ్రూప్–2లోకి జింబాబ్వే, నెదర్లాండ్స్ వచ్చాయి. దీంతో రోహిత్ సేనకు పాక్, దక్షిణాఫ్రికాలతోనే కాస్త పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మరో టీమ్ బంగ్లాదేశ్ కూడా పేలవ ఫామ్ తో ఇబ్బందిపడుతోంది. టీ–20లో ఏ క్షణమైనా ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది.