
అంటిగ్వా : వెస్టిండీస్ తో 2 టెస్టుల సిరీస్ లో భాగంగా గురువారం ఫస్ట్ టెస్టు ప్రారంభంకానుంది. ఆ సిరీస్ లో టీమిండియా ఆటగాళ్లు కొత్తగా కనిపించనున్నారు. ఐసీసీ కొత్త రూల్స్ కు అనుగుణంగా కోహ్లి సేనతో పాటు విండీస్ ప్లేయర్లు నయా జెర్సీలతో గ్రౌండ్ లోకి దిగనున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా ప్లేయర్ల కొత్త జెర్సీలను అఫీషియల్ గా రిలీజ్ చేసింది BCCI.
కెప్టెన్ విరాట్, వైస్ కెప్టెన్ అజింక్యా రహానేతో పాటు యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ లు కొత్తలతో కనిపించారు. టెస్టు సిరీస్ కు ఎంపికైన 16 మంది సభ్యులు పాల్గొని సందడి చేశారు. ఆటగాళ్లకు సంబంధించిన ఫోటోలను టీమిండియా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.