3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న టెక్ మహీంద్రా

3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న టెక్ మహీంద్రా

దేశంలోనే అతిపెద్ద ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టెక్ మహీంద్రా కొత్తగా 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. వచ్చే ఐదేళ్లలో గుజరాత్ లోని యువతకు ఈ అవకాశం కల్పించనున్నట్టు టెక్ మహీంద్రా ఓ ప్రకటనలో తెలిపింది.  ఈ విషయంపై ఇటీవలే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ పాలసీ కింద గుజరాత్ ప్రభుత్వంతో దిగ్గజ సంస్థ ఒప్పందం చేసుకుంది. అత్యాధునిక డిజిటల్ ఇంజినీరింగ్ సేవలను అందించడమే లక్ష్యంగా గుజరాత్ ప్రభుత్వంతో  (ఎంఓయూ)పై సంతకం చేశామని టెక్‌ఎం తాజాగా వెల్లడించింది. మరిన్ని డిజిటల్ సేవలను అందించేందు ఈ డీల్‌ ఉపయోగ పడుతుందని ఈ సందర్భంగా తెలిపింది. 

వీటితో పాటు గుజరాత్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నామని టెక్ మహీంద్రా స్పష్టం చేసింది. అందులో భాగంగానే వచ్చే ఐదేళ్లలో 3వేల మందికి పైగా నిపుణులను నియమించుకోనున్నామని తెలిపింది. మారుతున్న ఇంజినీరింగ్ అవసరాలను తీర్చేందుకు ఈ ఒప్పందం కంపెనీకి వీలు కల్పిస్తుందని  కంపెనీ  సీఎండీ  సీపీ  గుర్నాని  వెల్లడించారు.  అలాగే రాష్ట్రంలో ఈజీ బిజినెస్‌కు అందిస్తున్న ప్రోత్సాహంపై ఆయన ప్రశంసలు  కురిపించారు.