గంజాయి అమ్ముతున్న సాఫ్ట్​వేర్​ ఉద్యోగి అరెస్ట్

గంజాయి అమ్ముతున్న సాఫ్ట్​వేర్​ ఉద్యోగి అరెస్ట్

మాదాపూర్​, వెలుగు: శాలరీ సరిపోక, గంజాయి అమ్ముతున్న సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని మాదాపూర్‌‌‌‌ పోలీసులు అరెస్ట్​చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన యాపుగంటి ఫణికిరణ్(27)కు 2016లో రాజమండ్రికి చెందిన నాగు అలియాస్​నాగువర్మ పరిచయం అయ్యాడు. ఇతని ద్వారా ఫణికిరణ్ గంజాయి తాగడం అలవాటు చేసుకున్నాడు. తర్వాత ఫణికిరణ్​హైదరాబాద్​వచ్చాడు. మాదాపూర్​వీకర్స్​సెక్షన్​కాలనీలోని ఓ హాస్టల్​లో ఉంటూ.. ఐటీ కారిడార్‌‌‌‌లోని ఓ సాఫ్ట్​వేర్​కంపెనీలో పనిచేస్తున్నాడు. 

జీతం సరిపోకపోవడంతో గంజాయి అమ్మాలని డిసైడ్​అయ్యాడు. నాగువర్మను కాంటాక్ట్​అయి కేజీ గంజాయిని రూ.10 వేలకు కొనుగోలు చేయడం మొదలుపెట్టాడు. చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చిస్నేహితులు, ఉద్యోగులకు అమ్ముతూ వస్తున్నాడు. సమాచారం అందుకున్న మాదాపూర్​పోలీసులు ఫణికిరణ్​ ఉంటున్న హాస్టల్​గదిలో రైడ్​ చేసి 1,643 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  గతంలో గంజాయి అమ్ముతూ ఫణికిరణ్​పట్టుబడినట్లు పోలీసులు గుర్తించారు. శనివారం నిందితుడిని అరెస్ట్​చేశారు. నాగువర్మ పరారీలో ఉన్నాడు.