
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ గమనించి వెంటనే విమానాశ్రయంలోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
ఎయిర్ పోర్ట్ అధికారుల వివరాల ప్రకారం.. జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానం బుధవారం 160 మంది ప్రయాణికులతో శంషాబాద్నుంచి ఫ్రాంక్ ఫర్ట్కు వెళ్తోంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ముందు టైరులో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్ వెంటనే విమానాన్ని రన్ వే పై సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు.