రోబోటిక్స్ శిక్షణతో టెక్నికల్ నాలెడ్జ్ .. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్

రోబోటిక్స్ శిక్షణతో  టెక్నికల్ నాలెడ్జ్ .. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్

వికారాబాద్​, వెలుగు: విద్యార్థుల్లో సాంకేతిక స్ఫూర్తికి రోబోటిక్స్ శిక్షణ బీజం వేసిందని వికారాబాద్​ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో రోబోటిక్స్ ఇన్ అకాడెమిక్స్   కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు.

 ఈ నేపథ్యంలో శుక్రవారం వికారాబాద్ సంగం లక్ష్మీబాయి (గర్ల్స్​) స్కూల్​ను ఆయన విజిట్​ చేశారు. రోబోటిక్స్​ శిక్షణ ప్రగతిని సమీక్షించారు. స్టూడెంట్స్​ను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని  పరిశీలించారు. ప్రతి పాఠశాలకు రోబోటిక్స్ కిట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. 

కలెక్టర్​ జన్మదిన వేడుకలు..

కలెక్టర్ ప్రతీక్ జైన్ జన్మ దిన వేడుకలను శుక్రవారం కలెక్టరేట్​లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు. అడిషనల్​ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీఆర్వో మంగీలాల్, డీఆర్డీఏ శ్రీనివాస్, ఆర్డీవో వాసుచంద్ర విషెస్​ చెప్పారు.