బాస్కెట్ బాల్ పోల్ ఉరికంభం అయ్యింది.. ఈ ప్లేయర్ ఎలా చనిపోయాడో చూడండి..

బాస్కెట్ బాల్ పోల్ ఉరికంభం అయ్యింది.. ఈ ప్లేయర్ ఎలా చనిపోయాడో చూడండి..

మృత్యువు ఎప్పుడు ఎలా ఎవరి పైన పగబడుతుందో ఊహించడం కష్టం అనేదానికి ఉదాహరణ ఈ ఘటన. సరదాగా ఆడుకుంటున్న ప్లేయర్.. చనిపోయిన విధానం చూసి దేశం అంతా షాక్ కు గురైంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫూటేజ్.. సోసల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మంగళవారం (నవంబర్ 25) హర్యానాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసిన వారిని ఒక్కసారిగా దిగ్భ్రాంతిలో పడేసింది. రోహతక్ లో బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ చేస్తున్న 16 ఏళ్ల టీనేజ్ కుర్రాడు.. పోల్ మీద పడి తీవ్ర గాయాలపాలై చనిపోయాడు. 

రోహతక్ లోని లఖాన్ మజ్రా గ్రామంలో ఉదయం 10 గంటలకు ఈ ఇన్సిడెంట్ జరిగింది. బాస్కెట్ బాల్ కోర్టులో ఒక్కడే ప్రాక్టీస్ చేస్తుండగా.. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 

ప్రాక్టీస్ లో భాగంగా పరుగున వెళ్లి.. పోల్ కు ఉన్న బాస్కెట్ ను జంప్ చేసి పట్టుకున్నాడు. అంతే.. మధ్యలోకి విరిగిన స్తంభం.. అమాంతం ఆ కుర్రాడి ఎదపైన పడిపోయింది. భయంకరమైన ఈ ఘటనను చూసిన ఇతర ప్లేయర్స్ వెంటనే వెళ్లి ఎంతో ప్రయాసపడి పోల్ ను ఎత్తారు. గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందడం విషాదాన్ని నింపింది.

నేషనల్ లెవెల్ లో అదరగొడుతున్న ప్లేయర్:

చనిపోయిన 16 ఏండ్ల ప్లేయర్ నేషనల్ లెవెల్ లో అద్భుత ప్రదర్శన చేస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ కాంపిటీషన్స్ లో పథకాలు సాధించినట్లు సాటి ప్లేయర్స్ తెలిపారు. కంగ్రాలో జరిగిన 47వ సబ్ జూనియర్ చాంపియన్షిప్ లో, హైదరాబాద్ లో జరిగిన 49వ చాంపియన్ షిప్ లో అదే విధంగా పుదుచ్చేరిలో 39వ యూత్ చాంపియన్ షిప్ లో పథకాలు సాధించాడు. 

ఈ ఘటన హర్యానా వ్యాప్తంగా ఉన్న క్రీడా సదుపాయాలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే ఈ ఘటనకు రెండు రోజులకు ముందు బహదుర్గర్ లో కూడా ఇలాంటి ప్రమాదమే జరగడం ఈ చర్చకు కారణం. హోషియర్ సింగ్ స్పోర్ట్స్ స్టేడియంలో 15 ఏళ్ల బాస్కెట్ బాల్ ప్లేయర్ పైన కూడా పోల్ పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో రోహతక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.