
- ఈ నెల 17న ప్రకటిస్తున్నట్లు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది. ఈ నెల 17న బీసీయూఎఫ్ (బీసీ యునైటెడ్ ఫ్రంట్) పేరుతో పార్టీని ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదివారం ప్రకటించారు. అదే రోజు పార్టీ విధివిధానాలు, జెండా ఆవిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. పార్టీలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. ‘‘సెప్టెంబరు 17 అంటే తెలంగాణ విమోచన దినం అని కొంతమంది, విద్రోహ దినం అని మరి కొంతమంది అంటున్నారు.
వాస్తవానికి భారతదేశంలో తెలంగాణ విలీనమైన రోజు సెప్టెంబరు 17. ఈ నేపథ్యంలో అదే రోజు పార్టీని ఏర్పాటు చేస్తున్నాం” అని మల్లన్న వివరించారు. రాష్ర్టంలో అన్ని పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. బీసీలను పార్టీలు ఎలా మోసం చేస్తున్నాయో లెక్కలతో సహా వివరిస్తానని చెప్పారు.