
ముదిరాజ్ లు అధికారంలో ఉంటే ఉద్యోగాలొస్తాయన్నారు తీన్మార్ మల్లన్న (అలియాస్ చింతపండు నవీన్ కుమార్). పరకాలలో ముదిరాజ్ మహాసభకు హాజరైన తీన్మార్ మల్లన్న .. రాష్ట్రంలో 50 లక్షల మంది ముదిరాజులు ఉన్నారని.. ఒక్క రోజు మందు బంజేస్తే ప్రభుత్వం పడిపోతుందన్నారు. ప్రభుత్వం దగ్గర చేప పిల్లల లెక్క ఉంది కానీ ముదిరాజుల లెక్క లేకపోవడం సిగ్గుచేటన్నారు.
రాష్ట్రంలో 0.02 శాతం వెలమలు ఉన్నారని.. వాళ్లవి 207 ఇండ్లు కూడా లేవని చెప్పారు తీన్మార్ మల్లన్న. ముదిరాజులు ఎన్నికల్లో నిలబడితే 15 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని... అడుక్కుంటే మూడు లేదా నాలుగు వస్తాయని తెలిపారు. సింహ గర్జన సభ పెట్టుకుంటే పిల్లిలా మాట్లాడకూడదన్నారు. బీఆర్ఎస్ ను గద్దె దించేందుకు పోరాడాలన్నారు. ఇంత పెద్ద ఉద్యమం జరిగితే కేసీఆర్ రక్తం బొట్టు కూడా రాలలేదన్నారు తీన్మార్ మల్లన్న.