తేజ సజ్జ మిరాయ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

తేజ సజ్జ మిరాయ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

హనుమాన్ మూవీ ఫేమ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రస్తుతం మిరాయ్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.  ఈ చిత్రానికి టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీఫుల్ హీరోయిన్ రితికా నాయక్ నటిస్తుండగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో టాలీవుడ్ ప్రముఖ హీరో మంచు మనోజ్ నటిస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్ మరియు ఫ్యాంటసీ యాక్షన్స్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆమధ్య తేజ సజ్జ కి సంబంధించిన గ్లింప్స్ ని విడుదల చేయగా ఇందులో సూపర్ యోధ గా కనిపించాడు.

ALSO READ : బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: ఆ క్రేజీ డైరెక్టర్ తో నాలుగోసారి

దసరా పండుగ సందర్భంగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 18న తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ, తదితర భాషలలో ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే అభిమనులకి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో తేజ సజ్జ కపాలాలు, అఘోరాల మధ్య కూర్చుని మాస్ లుక్ లో కనిపించాడు.

దీంతో మిరాయ్ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే గతంలో తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది. దీంతో మిరాయ్ చిత్రంతో సక్సస్ ట్రాక్ ని కొనససాగించేందుకు బాగానే కష్టపడుతున్నాడు.