పాట్నా: బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం (నవంబర్ 17) పాట్నాలోని తేజస్వీ యాదవ్ నివాసంలో ఆర్జేడీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తేజస్వీ యాదవ్‌ను ప్రతిపక్ష నాయకుడిగా ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే, బీహార్ ఎన్నికల్లో మహాఘట్బంధన్ కూటమి ఘోర పరాజయంపై చర్చించారు. ఓటమికి గల కారణాలను ఎమ్మెల్యేలు సమీక్షించారు.
కాగా, ఇటీవల బీహార్‌లోని 243 స్థానాలకు రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తన కుటుంబానికి కంచుకోటైనా రాఘోపూర్ నుంచి బరిలోకి దిగిన తేజస్వీ యాదవ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. తేజస్వీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మహాఘట్బందన్ కూటమి ఘోర పరాజయం పాలైంది. కేవలం 35 స్థానాల్లోనే విజయ సాధించి మరోసారి ప్రతిపక్షాలనికి పరిమితమైంది.
►ALSO READ | దడ పుట్టిస్తున్న 'పార్శిల్' కథ: 32 కోట్లు పోగొట్టుకున్న బెంగళూరు మహిళ.. డిజిటల్ అరెస్ట్ పేరుతో 6 నెలలు..!
ఆర్జేడీ 25 సీట్లు మాతమ్రే గెలిచి పార్టీ చరిత్రలోనే రెండో ఘోర పరాజయాన్ని చవిచూసింది. బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీయే కూటమి 202 స్థానాలల్లో విజయఢంకా మోగించి తిరిగి అధికారం నిలబెట్టుకుంది. నితీష్ కుమార్ పదోసారి బీహార్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. 2025, నవంబర్ 20న జరగనున్న బీహార్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోడీ చీఫ్ గెస్ట్‌గా హాజరుకున్నారు.
