మహిళా సంఘాల్లో పనిచేస్తున్న వారికి నెలకు రూ.30 వేల జీతం.. పర్మనెంట్ ఉద్యోగాలు: బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ హామీలు

మహిళా సంఘాల్లో పనిచేస్తున్న వారికి నెలకు రూ.30 వేల జీతం.. పర్మనెంట్ ఉద్యోగాలు: బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ హామీలు

బీహార్ ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురుస్తోంది. గెలుపు కోసం అన్ని పార్టీలు హామీల మీద హామీలు ఇస్తున్నాయి. లేటెస్ట్ గా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. ఆ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ వర్కర్స్ ను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. అంతే కాదు 30 వేల రూపాయల జీతం కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. మహాగట్బంధన్ అధికారంలోకి వస్తే.. ఈ హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చరు. 

రాష్ట్రంలో ఉన్న స్వయం సమృద్ధి మహిళా సంఘాలలో పనిచేస్తున్న వారికి శాస్వత ప్రాతిపదికన ఉద్యోగం తో పాటు నెలకు రూ.30 వేల జీతం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న డిమాండ్ ను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఇది సాధారణ ప్రకటన కాదని.. మహిళా సంఘాల నుంచి ఉన్న డిమాండ్ అని తెలిపారు. 

తేజస్వీ యాదవ్ హామీలు:

  • మహిళా సంఘాలు తీసుకున్న లోన్లపై వడ్డీ మాఫీ
  • రెండేళ్ల వరకు వడ్డీ లేని లోన్లు
  • ఇతర ప్రభుత్వ పనుల్లో పాలుపంచుకుంటే నెలకు 2 వేల రూపాయల అలొవెన్స్
  • ఐదు లక్షల రూపాయల వరకు ఇన్సురెన్స్ కవరేజ్
  • తల్లీ కూతురుకు సంబంధించిన స్కీమ్ ప్రకారం.. విద్య, ఉద్యోగం, ట్రైనింగ్, ఆదాయం క్రమంలో లాభం చేకూర్చనున్నట్లు తెలిపారు. 
  • బీహార్ ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం. 

ప్రతీ నెలా ఉద్యోగుల జీతంలో నుంచి 18 శాతం జీఎస్టీ కట్ అవుతుందని.. మహిళా ఉద్యోగులకు కనీసం రెండు రోజుల సెలవు కూడా ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మార్పులు చేస్తామని తెలిపారు. 

అంతకు ముందు అక్టోబర్ 09న ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు తేజస్వీ. ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోనే దీన్ని అమలు చేసి తీరుతామని అన్నారు. 20 నెలల్లో ఈ స్వీమ్ ను పూర్తిగా అమలు చేయనున్నట్లు తెలిపారు.