
- ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్కూళ్ల టైమింగ్స్‌ను ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు హైస్కూల్ వేళల్లో మార్పు లు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు హైస్కూల్ టైమింగ్స్ఉం డగా.. ఇప్పుడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటలకు మార్చారు.
ఇక హైదరాబాద్‌లో అప్పర్ ప్రైమరీ స్కూళ్ల టైమింగ్స్కూడా మార్చారు. సిటీలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అప్పర్ ప్రైమరీ స్కూళ్లను ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడపాలని సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.