మహిళా నీకు వందనం : రోజుకు 27 లక్షల మంది.. రూ.10 కోట్ల విలువైన ఫ్రీ టికెట్లు

మహిళా నీకు వందనం : రోజుకు 27 లక్షల మంది.. రూ.10 కోట్ల విలువైన ఫ్రీ టికెట్లు

తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ బస్సు జర్నీకి  భారీ రెస్పాన్స్ వస్తోంది. రికార్ట్ స్థాయిలో మహిళలు ఫ్రీ బస్సు జర్నీని ఉపయోగించుకుంటున్నారు. 

మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్రంలోని 6 కోట్ల50 లక్షల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) వెల్లడించింది.రోజుకు సగటున 27 లక్షల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా  ప్రయాణిస్తుండగా రోజుకు రూ.10 కోట్ల విలువైన జీరో టిక్కెట్లు జారీ అవుతున్నాయని అధికారులు తెలిపారు.

జనవరి 3న  ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లు మహాలక్ష్మి స్కీమ్ ను సక్సెస్ చేస్తున్న సిబ్బంది, అధికారులను అభినందించారు. ఈ స్కీం కింద ఇప్పటి వరకు 6 కోట్ల 50లక్షల మంది మహిళలు ప్రయాణాలు సాగించడం గొప్ప విషయమన్నారు.  ఈ స్కీమ్ ను ఇలానే ప్రశాంత వాతావరణంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.