రేపే (మే 11) ఏఎన్ఎం ఫలితాలు విడుదల..కోర్టు చిక్కులు వీడడంతో లైన్ క్లియర్

రేపే (మే 11) ఏఎన్ఎం ఫలితాలు విడుదల..కోర్టు చిక్కులు వీడడంతో లైన్ క్లియర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మల్టీ పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ (ఏఎన్‌‌‌‌‌‌‌‌ఎం) పోస్టుల భర్తీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. మూడేళ్లుగా కోర్టు కేసులతో పెండింగ్‌‌‌‌‌‌‌‌ లో ఉన్న 1,931 ఏఎన్‌‌‌‌‌‌‌‌ఎం పోస్టుల ఫలితాలను రేపు (సోమవారం) విడుదల చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌ మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 30 మార్కుల వెయిటేజీపై అభ్యర్థులు కోర్టుకు వెళ్లగా, హైకోర్టు ఆదేశాల మేరకు దానిని 20 శాతానికి పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. న్యాయశాఖ అభిప్రాయం మేరకు లీగల్ చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వం, మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష తర్వాత ఫలితాల వెల్లడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2024 డిసెంబర్​లో నిర్వహించిన రాత పరీక్షకు సుమారు 20,600 మంది అభ్యర్థులు హాజరయ్యారు.