తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. కీలకమైన ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలిపి సభను సభాధ్యక్షుడు నిరవధికంగా వాయిదా వేశారు. ఆగస్టు 3న ప్రారంభమైన సమావేశాలు నాలుగు రోజుల పాటు జరిగాయి. 

సీఎం ప్రసంగం ముగిసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ పువ్వాడ అజయ్‌ కుమార్‌ బిల్లును ప్రవేశపెట్టగా శాసనసభ ఆమోదించింది. గవర్నర్​ తిప్పి పంపిన బిల్లులకు సైతం ఆమోద ముద్ర వేశారు.  వాయిదాకు ముందు ప్రజా గాయకుడు గద్దర్​సేవల్ని గుర్తు చేసుకున్నారు.