29న అసెంబ్లీ సమావేశాలు షురూ : గవర్నర్

29న అసెంబ్లీ సమావేశాలు షురూ : గవర్నర్
  • నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈ నెల 29న ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బుధవారం గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ నోటిఫికేషన్‌ జారీ చేశారు. కాగా, కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నారు. 

ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టులు, బీఆర్‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం, రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు, అనుమతులు వంటి అన్ని అంశాలపై సభలో సమగ్రంగా చర్చించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.