అసెంబ్లీ..మండలి ఎన్ని గంటలు నడిచాయంటే..

అసెంబ్లీ..మండలి ఎన్ని గంటలు నడిచాయంటే..
  • 7 రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాలు
  • 54 గంటల 55 నిమిషాలు నడిచిన అసెంబ్లీ
  • 12 గంటల 25 నిమిషాలు నడిచిన శాసనమండలి
  • ప్రతి రోజు కనీసం 8 నుంచి 12 గంటలపాటు సాగిన సమావేశాలు

హైదరాబాద్: ఈసారి అసెంబ్లీ సమావేశాలు అర్ధవంతంగా సాగాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 7 రోజులపాటు జరుగగా అసెంబ్లీ 54 గంటల  55 నిమిషాలు నడిచింది. అలాగే శాసనమండలి 12 గంటల 25 నిమిషాలు నడిచింది. తక్కువ రోజులే సమావేశాలు జరిగినా.. ఎక్కువ సమయం పాటు సమావేశాలు జరిగాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. సమావేశాలు జరిగిన తీరుపై అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి  ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ద్వారా కొన్ని ముఖ్యమైన  ప్రకటనలు వచ్చాయని.. ప్రజాధనం వృధా కావడం సీఎం కేసీఆర్ కు ఇష్టం ఉండదని, అందుకే ఎన్ని రోజులు జరిపినా ఎక్కవ సమయం సభను నడపడం జరిగిందన్నారు. ఒక్క రోజుకు మినిమం 8 గంటలు, ఒక్కోరోజు 12 గంటలు కూడా సభ  సాగిందని వివరించారు. 
మల్లు భట్టి విక్రమార్క ప్రతిపక్షంలో ఉన్నాం.. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడాం అన్నట్లు వ్యవహరించారని పేర్కొన్నారు. అయినా కాంగ్రెస్ వాళ్లకు ఎక్కువ సమయం ఇచ్చామమన్నారు. 
కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆరుగురిలో ఇద్దరో.. ముగ్గురో వచ్చేవారు
కాంగ్రెస్ పార్టీలో ఉన్నది 6మంది సభ్యులే. కానీ ఇద్దరు ముగ్గురే సభకు వచ్చే వారు...ఒక్కో సారి అసలు సభలోనే ఉండరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వారు 6గంటల 15 నిమిషాలు మాట్లాడారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి 103 మంది సభ్యులు ఉంటే 13గంటల 42 నిమిషాలు సభలో మాట్లాడారని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఎంఐఎం వారు 5 గంటల 15 నిమిషాలు మాట్లాడారని.. సీఎం కేసీఆర్ కంటే ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ లకు మాట్లాడాడనికి ఎక్కువ  అవకాశం ఇచ్చామన్నారు. మా పోరాట ఫలితమే ముఖ్యమంత్రి ప్రకటనలు వచ్చాయని భట్టి విక్రమార్క చెప్తున్నారని ప్రస్తావిస్తూ పోరాటం లేదు..పాడు లేదు.. ఏదో మీడియా ఉందని మాట్లాడటం తప్ప వాళ్లు చేసిందేమీ లేదన్నారు. 
బీజేపీ ఎమ్మెల్యేలు కావాలనే సృష్టించుకున్నారు
బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ గురించి మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యేలు కావాలనే సృష్టించుకున్నారని ఆరోపించారు. కేంద్రం నిర్ణయాలను మేము ఎండగడుతామని వాళ్లకి తెలిసే సభలో ఉండకూడదని గందరగోళం చేశారన్నారు. ప్రజా సమస్యల పైన మాట్లాడటం బీజేపీ ఎమ్మెల్యేలకు ఇష్టం లేదని, కావాలనే వారు తోక ముడుచుకొని వెళ్లారని, డ్రామాలు చేస్తూ ఇవాళ మళ్ళీ అసెంబ్లీ కి వచ్చారని అన్నారు. స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని తెలిసి మళ్లీ ప్రజా స్వామ్యం ఖూనీ అయ్యిందని ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో,రాజ్యసభ, లోక్ సభలలో ఏమీ చేయకపోయినా వారిని సస్పెండ్ చేశారని.. అక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ కాలేదా...? ఇక్కడే అవుతుందా? అని ప్రశ్నించారు. 

 

ఇవి కూడా చదవండి

ఆఫీసుల్లో సెల్ ఫోన్ వాడడంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

ఐపీఎస్ అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం

వచ్చే వందేండ్ల దాక సిటీలో తాగునీటి సమస్య రాదు