ఆఫీసుల్లో సెల్ ఫోన్ వాడడంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

ఆఫీసుల్లో సెల్ ఫోన్ వాడడంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
  • విధి విధానాలు తయారు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు

చెన్నై: ఆఫీసుల్లో సెల్ ఫోన్ ఉపయోగించడంపై మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుల్లో సెల్ ఫోన్ వాడొద్దని ఆదేశాలిచ్చింది. దీనికోసం తమిళనాడు ప్రభుత్వం గైడ్ లైన్స్ తయారు చేయాలని.. వాటిని పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అత్యవసర కాల్స్ మాట్లాడొచ్చని.. అయితే దానికోసం ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని చెప్పింది. మిగతా సమయాల్లో మొబైల్ సైలెంట్ గా గానీ, వైబ్రేషన్ లో గానీ పెట్టుకోవాలన్నారు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణ్యం. ఆఫీసులో ఎవరికీ ఇబ్బంది కలిగించొద్దన్నారు. 
ఈ నిబంధనను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఖచ్చితంగా పాటించాలన్నారు న్యాయమూర్తి. అయితే.. పర్సనల్ కాల్స్ మాత్రం మాట్లాడొద్దని, తమ విధులకు సంబంధించి కాల్స్ మాట్లాడొచ్చన్నారు. తిరుచిరాపల్లిలో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి వేసిన పిటిషన్ పై వాదనలు విన్న మద్రాస్ కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. తన పై ఉద్యోగి.. పదే పదే తనను వీడియో తీస్తున్నారని.. వద్దని చెప్పినా వినడం లేదని కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు కోర్టు.. ఇది ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి కనీస బాధ్యతని అభిప్రాయపడింది. 

 

 

ఇవి కూడా చదవండి

ఐపీఎస్ అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం

వచ్చే వందేండ్ల దాక సిటీలో తాగునీటి సమస్య రాదు

చైనాలో కరోనా ఫోర్త్ వేవ్.. లక్షణాలు ఇవే..

పెట్రో రేట్ల తగ్గింపుపై మరిన్ని చర్యలకు రెడీ