పెట్రో రేట్ల తగ్గింపుపై మరిన్ని చర్యలకు రెడీ

పెట్రో రేట్ల తగ్గింపుపై మరిన్ని చర్యలకు రెడీ

న్యూఢిల్లీ: పెట్రోల్ ధరల తగ్గింపుపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ  కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రో రేట్లను తగ్గించేందుకు అవసరమైన మరిన్ని చర్యలను తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంట్ లో ఆయన అన్నారు. వినియోగదారులకు ఊరట కల్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. రాజ్యసభ క్వశ్చన్ అవర్ లో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అడిగిన ప్రశ్నకు హర్దీప్ పైవిధంగా జవాబిచ్చారు. జీఎస్టీని ప్రవేశపెట్టిన సమయంలో అందులోకి పెట్రోలియం ఉత్పత్తులను చేరుస్తామంటూ చేసిన ప్రతిపాదన గురించి ఆనంద్ శర్మ సభలో క్వశ్చన్ చేశారు. దీనికి హర్దీప్ స్పందిస్తూ.. పెట్రోల్, పెట్రోలియం ప్రొడక్ట్స్ తోపాటు లిక్కర్ పై అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న కొన్ని రాష్ట్రాలు.. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను చేర్చడానికి ససేమిరా అంటున్నాయని చెప్పారు. 

ఎలక్షన్లను బట్టి ధరల్లో తేడాలు ఉండవ్ 

ఫ్యుయల్ ప్రైజ్ ను కేంద్రం కంట్రోల్ చేస్తుందన్న ఆరోపణల్ని హర్దీప్ పురీ కొట్టిపారేశారు. అంతర్జాతీయంగా ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలతోపాటు సరుకు రవాణా, రిఫైనింగ్ మార్జిన్లు, డీలర్ కమిషన్ లాంటి పలు అంశాలపై రేట్లు ముడిపడి ఉంటాయని స్పష్టం చేశారు. ఎలక్షన్లను బట్టి పెట్రో రేట్లలో తేడాలు ఉండవన్నారు. ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయన్నారు. మార్కెటింగ్ కంపెనీలు తమ లాభనష్టాలు, మార్జిన్లను బట్టి నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. కాబట్టి ఎన్నికలతో పెట్రో రేట్లను ముడిపెట్టడం సరికాదన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రష్యా తక్కువ ధరకే పెట్రోల్ ను ఇస్తామని భారత్ కు ఆఫర్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై హర్దీప్ మాట్లాడుతూ.. రష్యన్ అధికారులతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. 

బయటి దేశాల్లో 50 శాతం.. భారత్లో 5 శాతమే పెంపు

కరోనా మహమ్మారి కాలంలో చాలా దేశాల్లో ఇంధన ధరలు 50 శాతానికి పైగా పెరిగాయని.. కానీ భారత్ లో మాత్రం ధరలు 5 శాతమే పెరిగాయని హర్దీప్ సింగ్ పురీ రాజ్యసభలో తెలిపారు. గతేడాది నవంబర్ 4న ఫ్యుయల్ పై కేంద్రం పన్నులు తగ్గిస్తే.. మహారాష్ట్ర, కేరళతో సహా తొమ్మిది రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌ మీద వ్యాట్‌ను తగ్గించలేదన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వానికేం సంబంధం?

హిజాబ్ ధరించడం ఇస్లాంలో ఒక ముఖ్యమైన ఆచారం