చైనాలో కరోనా ఫోర్త్ వేవ్.. లక్షణాలు ఇవే..

చైనాలో కరోనా ఫోర్త్ వేవ్.. లక్షణాలు ఇవే..

చైనాలో కరోనా వైరస్ మరోసారి విధ్వంసం ప్రారంభించింది. రోజురోజుకు చైనాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కొత్త కేసులు పెరిగిపోవడంతో పలు నగరాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. దీంతో తగ్గిపోయిందనుకున్న వైరస్ మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రపంచమంతా మరోసారి టెన్షన్ పడుతోంది. ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే దేశంలోని చాలా నగరాల్లో, గత రెండేళ్లుగా ఒక్క కేసు కూడా కనిపించలేదు. అన్నిచోట్ల కరోనా నిబంధనలు పాటిస్తూ.. కరోనా కంట్రోల్ ను కట్టుదిట్టం చేశారు. అయితే ప్రస్తుతం చైనాలో ప్రస్తుతం మరోసారి విధ్వంసం సృష్టిస్తోన్న  కరోనా వైరస్ కొత్త వేరియంట్ ప్రభావం ఎలాంటిది, దాని లక్షణాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.   

UK హెల్త్ ఏజెన్సీ (UKHSA) ప్రకారం, స్టెల్త్ ఓమిక్రాన్‌ను BA.2 అని కూడా పిలుస్తారు. ఇది ఓమిక్రాన్ యొక్క ఉప రూపకం. ఇది ఒరిజినల్ ఒమిక్రాన్ కంటే 1.5 రెట్లు ఎక్కువ అంటువ్యాధి అని అధ్యయనాలు చెబుతున్నాయి. చివరిసారిగా థర్డ్ వేవ్‌కు కారణమైన కరోనాకు సంబంధించిన అదే రూపాంతరం. ప్రస్తుతం, ఇది అనేక రూపాలను మారుస్తోంది. ఈ వైరస్ కరోనా ఫోర్త్ వేవ్‌కు కూడా కారణమవుతుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇంకా BA.2ని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా పరిగణించలేదు. అయితే, ఆ సంస్థ దాని వ్యాప్తిని పర్యవేక్షిస్తోంది. BA.2 అనేక దేశాలలో అసలు Omicron జాతిని భర్తీ చేయడం ప్రారంభించింది.

ఒక నివేదిక ప్రకారం, స్టీల్త్ ఓమిక్రాన్ యొక్క లక్షణాలు పొట్టకు సంబంధించి ఉంటాయి. ఈ వైరస్ సోకిన రోగులలో ప్రేగు సంబంధిత లక్షణాలు గుర్తించారు. వికారం, విరేచనాలు, వాంతులు, పొత్తికడుపు నొప్పి, మంట లేదా కడుపులో వాపు వంటి లక్షణాలు ఉంటే, మీరు ఆ వైరస్ గ్రిప్‌లో ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ లక్షణాలు ఏ మాత్రం కనిపించినా వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలి. ఇక దాని సాధారణ లక్షణాల గురించి మాట్లాడినట్లయితే,  అవన్నీ కూడా ఈ వేరియంట్ కలిగి ఉంటుంది. జ్వరం, విపరీతమైన అలసట, దగ్గు గొంతునొప్పి, కండరాల అలసట, హార్ట్ బీట్ పెరగడం వంటి లక్షణాలు కూడా ఫోర్త్ వేవ్‌కు కారణమవుతున్నాయి. 

చైనాలో BA.2 వేగంగా వ్యాప్తి చెందడం ప్రపంచాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే కరోనాతో చాలా దేశాలు అనేక ఇబ్బందులుపడ్డాయి. కరోనా మూడో వేవ్ దెబ్బ నుంచి కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. మరి ఇలాంటి సమయంలో చైనాలో ఫోర్త్ వేవ్ ప్రబలడం అనేక భయాందోళనలకు గురి చేస్తోంది. స్టెల్త్ ఓమిక్రాన్ వేరియంట్ ఆరోగ్య నిపుణులకు, ప్రపంచానికి కొత్త సవాలుగా మారే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.