తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు.. 51.89 శాతం పోలింగ్ నమోదు

తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు.. 51.89 శాతం పోలింగ్ నమోదు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 51.89 శాతం పోలింగ్ నమోదయ్యింది.  అత్యధికంగా మెదక్ లో 69 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా  హైదరాబాద్ లో 31.17 శాతం నమోదయ్యింది. 

ములుగులో 68 శాతం, ఆదిలాబాద్ లో 62, ఖమ్మంలో 63, వనపర్తిలో 60, నిజామాబాద్ లో 58 , గద్వాలలో65,రంగారెడ్డిలో 42 ,వికారాబాద్ లో 57 శాతం పోలింగ్  నమోదయ్యింది. తెలంగాణలో మొత్తం ఓటర్లు 3.26 కోట్లు ఉండగా..  ఇప్పటి వరకు కోటి 60 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతేడాది ఇదే సమయం వరకు  62 శాతం పోలింగ్‌ నమోదయ్యింది.

119 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.  ఈ సారి పోలింగ్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.