కేటీఆర్... నీ చరిత్ర అంతా నీ చెల్లి చెప్పింది.. తీరు మారకపోతే తరిమి కొడ్తం: ఎమ్మెల్యే నాయిని

కేటీఆర్... నీ చరిత్ర అంతా  నీ చెల్లి చెప్పింది.. తీరు మారకపోతే తరిమి కొడ్తం: ఎమ్మెల్యే నాయిని

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.  కేటీఆర్ గజ దొంగ నీతులు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు . సీఎం అనే గౌరవం లేకుండా కేటీఆర్  ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ చరిత్ర మొత్తం ఆయన చెల్లి కవిత బయటపెట్టిందన్నారు. వాళ్ళు చేసిన పాపాలకు మేము కేసులుపెడితూ  పోతే వాళ్ళ జీవితం అంతా జైలేనని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఫ్యామిలీ అంతా జైలుకుపోతుందని మండిపడ్డారు.

ALSO READ | పంచాయతీ నిధులపై చర్చకు సిద్ధమా .. బీఆర్ఎస్, కాంగ్రెస్కు కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్

మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్..  ప్రజల దృష్టి మరల్చి కేసుల నుంచి తప్పించుకోవడం కోసం కేటీఆర్  ప్రజలను రెచ్చగొట్టి తప్పుదారి పట్టిస్తున్నారు. నీ అయ్యా మాట్లాడినప్పుడు సోయి లేదా..! ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. రాష్ట్రంలో దాడులతో పబ్బం గడుపుతున్నారు.  మాకు ఓపిక నశించేలా చేస్తున్నారు. మేము ప్రతి దాడులు చేస్తే మీరు రోడ్ల పైన తిరగలేరు బిడ్డా.  మీరు పద్ధతి మార్చు కోకపోతే మిమ్మల్ని తరిమికొట్టడం వరంగల్ నుంచే ప్రారంభం అవుతుంది. నువ్వు దమ్ముంటే వరంగల్ రా అంటూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  కేటీఆర్ కు సవాల్ చేశారు. 

ఫ్యామిలీ అంతా క్రిమినల్స్: నాగరాజు

 కేటీఆర్ ఫ్యామిలీ అంతా క్రిమినల్స్ అని ఆరోపించారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు .  తాను తిట్టడం మొదలు పెడితే కేటీఆర్ తట్టుకోలేరన్నారు. తాను మాజీ పోలీస్ అధికారిని అని..తాను తిడితే కేసీఆర్ తట్టుకోలేడన్నారు.   కేటీఆర్ శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాపలా కుక్క కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుందని విమర్శించారు. కేటీఆర్  తెలంగాణకు చీడ పురుగులా మారారని ధ్వజమెత్తారు.  

 కేటీఆర్ ఒక కార్టున్.  గూగుల్ లో కచరా ఫ్యామిలీ అని కొడితే కేటీఆర్ ఫ్యామిలీనే  చూపిస్తుంది.  అమెరికా కంపు అంతా కేటీఆర్ నోట్లోనే ఉంది. కేటీఆర్  బాడీ అంతా విషం,  డ్రగ్సే ఉన్నాయి. నువ్వు, నీ కుటుంబం ఆర్ధిక నేరస్తులు. పాలకుర్తి లో దయాకర్ రావు పగటి వేషగాడులా తిరుగుతున్నాడు.  నీళ్లు వదులుతారని తెలిసే దయాకర్ రావు పాదయాత్ర పేరుతో డ్రామాలు చేస్తుండు అని ఎమ్మెల్యే నాగరాజు వ్యాఖ్యానించారు.