హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 3వ తేదీ లేదా 4వ తేదీ నుంచి నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన ఒకటి, రెండ్రోజుల్లో జారీ చేసే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 3వ తేదీన గవర్నర్ ప్రసంగం, 4న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. 5న బడ్జెట్‌ను- ప్రవేశపెట్టే అవకాశముంది. 12 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే చాన్స్ ఉంది.
