IND vs AFG Playing XI: ఆఫ్ఘనిస్తాన్‌తో రేపు (ఆదివారం, సెప్టెంబర్ 13న) జరగబోయే తొలి టీ20 పోరుకు ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఓపెనింగ్ కాంబినేషన్‌పై ఇప్పుడు తీవ్ర రచ్చ కొనసాగుతుంది. రెండు ఓపెనింగ్ స్థానాల కోసం అభిషేక్ శర్మ, సంజు శాంసన్, 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ పోటీపడుతుండగా, మొదటి మ్యాచ్‌లో ఈ వండర్ కిడ్‌కు ఊహించని షాక్ తగలబోతుందని టాక్ జోరుగా నడుస్తోంది.
బుమ్రా ధాటికి విలవిల.. వైభవ్‌పై వేటు:
శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో జస్ప్రీత్ బుమ్రా వేసిన స్పెల్‌ను ఎదుర్కొవడానికి 15 ఏళ్ల వైభవ్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దులీప్ ట్రోఫీ 2026లో రెడ్ బాల్ మ్యాచ్‌లు ఆడిన వైభవ్‌కు, ఫ్లడ్‌లైట్ల వెలుతురులో వైట్ బాల్‌ను ఎదుర్కోవడం కష్టంగా మారింది. దీంతో మేనేజ్‌మెంట్ తొలి మ్యాచ్‌లో వైభవ్‌కు రెస్ట్ ఇచ్చి బెంచ్‌కే పరిమితం చేయాలని చూస్తోంది.
అభిషేక్‌తో సంజు శాంసన్ ఓపెనింగ్:
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి పూర్తి మద్దతు లభించడంతో అభిషేక్ శర్మ తన ఓపెనింగ్ స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. వైభవ్ డ్రాప్ కానుండటంతో అభిషేక్‌కు జోడీగా సంజు శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక వెన్ను నొప్పితో భయపెట్టిన ఇషాన్ కిషన్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో మూడో స్థానంలో బరిలోకి దిగడం ఖాయమైంది.
భారత అంచనా జట్టు:
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబె, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
