- రెండు రోజుల్లో కీలక అంశాలపై చర్చ
- ప్రారంభం నుంచి ముగిసే వరకు సభ్యులంతా అసెంబ్లీలో ఉండాలె
అసెంబ్లీ సమావేశాలను శనివారం వరకు నిర్వ హించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా సభా సమయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సీఎల్పీ ఏకగ్రీవంగా తీర్మానించింది.
శుక్ర, శనివా రాలు పలు కీలక అంశాలపై సభలో చర్చించి, బీఆర్ఎస్ అవినీతిని, కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారా న్ని ఎండగట్టాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సభ ప్రారంభ మైనప్పటి నుంచి ముగిసే వరకు సభ్యులంతా విధిగా అసెంబ్లీలోనే ఉంటూ చర్చల్లో గళం విప్పా లని నిర్దేశించారు. ప్రతిపక్షాలు సృష్టించే గందర గోళానికి తావులేకుండా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను నిక్కచ్చిగా ప్రజల ముందుంచేందుకే అసెంబ్లీని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.
