అసెంబ్లీ : రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోవట్లే

అసెంబ్లీ :  రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోవట్లే

చాలా విషయాల్లో రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్నారు. టూరిజంతో పాటు ఇతర విషయాల్లో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పద్మశ్రీ అవార్డుల కోసం ప్రతిపాదనలు పంపినా పట్టించుకోలేదన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు కేసీఆర్. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. కానీ కేంద్రం నిర్లక్ష్యంతో మన పర్యాటక ప్రాంతాలు ఆదరణకు నోచుకోవడం లేదన్నారు సీఎం. TRS వచ్చాక కబ్జాలు, ఆక్రమణలు తగ్గాయన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో ఏళ్లుగా కబ్జా అయిన చెరువులను కాపాడుతున్నామన్నారు. నాలాలపై ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్ లో చెరువుల సుందరీకరణ గురించి సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు మంత్రి. 

ఎన్నికలు ఉన్న చోటే నిధులు కేటాయిస్తున్నారన్నారు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. ఎన్నికలు లేని చోట నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినా... రోడ్డు క్లీన్ చేయడానికి కార్మికులు లేరు... నిధులు లేవని సమస్యలను వివరించారు.  దుబ్బాక నియోజకవర్గంలోని రోడ్లను వెంటనే బాగు చేయాలన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. గత సమావేశాల్లోనే కోరినా మంత్రి పట్టించుకోలేదన్నారు. 

ముస్లింల సంక్షేమం కోసం 8వందలకు పైగా GOలు విడుదల చేసినా... ఒక్క పైసా విడుదల కాలేదన్నారు MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. సభలో అరిచిఅరిచీ కడుపుమండుతోంది గానీ ఫలితం లేదన్నారు. మైనార్టి వెల్ఫేర్, పాతబస్తి అభివృద్ధిపై జరిగిన చర్చలో మాట్లాడారు ఓవైసి 

ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయని ప్రశ్నిచారు CLP నేత భట్టి విక్రమార్క. ఎవరికోసం ఓల్డ్ సిటీకి మెట్రో  పోకుండా ఆపారో చెప్పాలన్నారు. ఉస్మానియా హాస్పిటల్ కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు.  కబ్జాలకు అడ్డాగా ఓల్డ్ సిటీ మారిందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. పాతబస్తీలో రోడ్లు బాగా లేవన్నారు. ఓల్డ్ సిటీకి ఎడ్యుకేషన్ చాలా అవసరమన్నారు.చర్చలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు మంత్రి కేటీఆర్. పాతబస్తీ మెట్రోకు కట్టుబడి ఉన్నామన్నారు. ఓల్డ్ సిటీకి కాంగ్రెస్ హయాంలో 3వేల కోట్లిస్తే... తాము 14వేల కోట్లిచ్చామన్నారు కేటీఆర్.

GST సవరణ బిల్లు, ప్రింటింగ్ ఆఫ్ షూటింగ్ అండ్ మాల్ ప్రాక్టీస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బిల్ 2021 ని సభ ఆమోదించింది. క్వశ్చన్ అవర్లో దళితబంధుపై ప్రశ్న ఉండగా.... దాన్ని పోస్ట్ పోన్ చేశారు స్పీకర్. TRS ఎమ్మెల్యేల కోరిక మేరకు దళితబంధుపై తర్వాత షార్ట్ డిస్కషన్ చేద్దామన్నారు.