హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈనెల 26న ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 55 పరీక్ష కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ జరగనుండగా, మొత్తం 14,489 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనుండగా.. ఉదయం10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్–2 పరీక్షలు జరుగుతాయని కమిషన్ సెక్రటరీ హరిత శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
