- స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బ్యాంకింగ్ రంగం గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. 2025~-26 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ( 2025 డిసెంబర్ 31నాటికి) వరకు రాష్ట్రంలోని బ్యాంకుల డిపాజిట్లు రూ.61,073 కోట్లు పెరిగాయి. దాంతో మొత్తం డిపాజిట్ల రూ.9,01,503 కోట్లకు చేరుకున్నాయి. తెలంగాణ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ తెలంగాణ) 48వ త్రైమాసిక సమీక్ష సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లోని హోటల్ మారిగోల్డ్‌లో జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్రంలోని బ్యాంకుల పనితీరును సమీక్షించారు.ఎస్‌బీఐ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం సహదేవన్ రాధాకృష్ణన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ త్రైమాసికంలో బ్యాంకుల అడ్వాన్స్‌లు (ఇచ్చిన లోన్లు) రూ.1,11,349 కోట్లు పెరిగాయి. దాంతో లోన్ల మొత్తం సుమారు 11.93 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ 3 నెలల్లోనే బ్యాంకులు కొత్తగా రూ.1.11 లక్షల కోట్ల లోన్లు పంపిణీ చేశాయి.
