ఇవాళ(అక్టోబర్ 22) 55 మందితో బీజేపీ ఫస్ట్ లిస్టు!

ఇవాళ(అక్టోబర్ 22) 55 మందితో బీజేపీ ఫస్ట్ లిస్టు!
  • ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, సీనియర్లకు జాబితాలో చోటు
  • బీసీలు, మహిళలకు పెద్దపీట
  • టికెట్ పొందిన కొందరికి కిషన్ రెడ్డి, సునీల్ బన్సల్ ఫోన్లు

హైదరాబాద్, వెలుగు:  55 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్టు సిద్ధమైంది. ఆదివారం ఈ మేరకు జాబితాను పార్టీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. నిజానికి శనివారమే క్యాండిడేట్ల ప్రకటన ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే రెండు, మూడు స్థానాల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉండడంతో చివరి క్షణంలో లిస్టు రిలీజ్ వాయిదా పడినట్లు పార్టీలో చర్చ సాగుతున్నది. మరోవైపు టికెట్ దక్కించుకున్న కొందరు నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర  ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్​ సునీల్ బన్సల్ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడారు. వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకోవాలని సూచించారు.

తొలి జాబితాలో వీళ్లకు చోటు?

బీజేపీ మొదటి జాబితాలో మహిళలకు, బీసీలకు పెద్దపీట వేసినట్లు ప్రచారం సాగుతున్నది. ఫస్ట్ లిస్టులో కనీసం 10 మంది వరకు మహిళలకు, సుమారు 20 మంది బీసీలకు చోటు దక్కినట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. లిస్టులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (కోరుట్ల), సోయం బాపూరావు (బోథ్), సిట్టింగ్ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు (దుబ్బాక), ఈటల రాజేందర్ (గజ్వేల్, హుజూరాబాద్), నేతలు మహేశ్వర రెడ్డి (నిర్మల్), రావు పద్మ (వరంగల్ వెస్ట్), శ్రీరాములు యాదవ్ (మహేశ్వరం), గూడూరు నారాయణ రెడ్డి (భువనగిరి), సంగప్ప (నారాయణ్ ఖేడ్), రాణి రుద్రమ (సిరిసిల్ల), కీర్తి రెడ్డి (భూపాలపల్లి ), సంకినేని వెంకటేశ్వర రావు (సూర్యాపేట), పాయల్ శంకర్ (ఆదిలాబాద్), రమేశ్ రాథోడ్ (ఖానాపూర్), జితేందర్ రెడ్డి (మహబూబ్ నగర్), నందీశ్వర్ గౌడ్ (పటాన్ చెరువు), కూన శ్రీశైలం గౌడ్ (కుత్బుల్లాపూర్), ఆచారి (కల్వకుర్తి), ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (ఉప్పల్), బొడిగె శోభ (చొప్పదండి), బాబూమోహన్ (ఆందోల్​), ధన్ పాల్ సూర్యనారాయణ (నిజామాబాద్ అర్బన్), అన్నపూర్ణమ్మ (బాల్కొండ), బోగ శ్రావణి (జగిత్యాల) తదితరులు ఉన్నట్లు తెలుస్తున్నది.