గవర్నర్‌ను కలిసిన టీబీజేపీ నేతలు

గవర్నర్‌ను కలిసిన టీబీజేపీ నేతలు

తెలంగాణ బీజేపీ నేతలు గవర్నర్‌తో భేటీ అయ్యారు. సోమవారం బండి సంజయ్‌ కాన్వాయ్‌పై దాడి జరిగిన విషయాన్నిగవర్నర్ తమిళిసైకు ఫిర్యాదు చేశారు. బీజేపీ గెలుపును జీర్ణించుకోలేక టీఆర్ఎస్ దాడులు చేస్తుందన్నారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ. భయానక వాతావరణ సృష్టించాలని చూస్తున్నారు. బెంగాల్ తరహా రాజకీయాలు తెలంగాణలో చేయాలని చూస్తున్నారన్నారు. స్వయంగా సీఎంయే మెడలు నరికేస్తాం,ఆరు ముక్కలు చేస్తా అన్నారన్నారు. సీఎం స్థాయికి తగని భాష మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లమాన్నారు. 

ప్రతిపక్షాలు తప్పకుండా ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. రైతుల బాధలు పట్టించుకోకుండా తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వేల కోట్లు ఖర్చు చేశారని డీకే అరుణ విమర్శించారు. అనేక అబద్ధపు హామీలు చేసిన హుజూరాబాద్ ప్రజలు లొంగకుండా... బెదరకుండా స్పష్టమైన తీర్పు నిచ్చారన్నారు. ఎన్నికలు, ఓట్లు వస్తే తప్పా సీఎం ఏం చేయలేని పరిస్థితి ఉందని ఆరోపించారు. కేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందన్నారు. ప్రతీ ఐకేపీ సెంటర్లలో రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.