ఢిల్లీకి బీజేపీ నేతలు.. అభ్యర్థుల ఎంపికపై చర్చ

ఢిల్లీకి బీజేపీ నేతలు.. అభ్యర్థుల ఎంపికపై చర్చ

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణ  బీజేపీ స్పీడ్ పెంచింది.  హైకమాండ్ పిలుపుతో ఆపార్టీ ఎంపీలు బండి సంజయ్, లక్ష్మ ణ్ సహా డీకే అరుణ, జితేందర్ రెడ్డితో పాటు సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం జరిగే బీజేపీ ఎలక్షన్ కోర్ కమిటీ భేటీలో రాష్ట్ర నేతలు పాల్గొననున్నారు. భేటీలో తెలంగాణలో MPటికెట్  లపై క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. అటు ఇప్పటికే ఢిల్లీలో ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమావేశంలో పాల్గొననున్నారు.

 తెలంగాణలో 17 సీట్లు గెలుస్తామని ఆ పార్టీ నేతలు ధీమ ా వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీతో పొత్తు ఉండబోదని.. బీఆర్ఎస్ పొత్తు ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదని తేల్చి చెప్పారు. తెలంగాణలో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యేనన్నారు. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెల్వబోదన్నారు.

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 9 తర్వాత వచ్చే అవకాశముందని  జోరుగా  ప్రచారం జరుగుతోంది.  ఎన్నికలు ఏప్రిల్, మే నెలలో జరగనున్నాయని భావిస్తున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలతో పాటు  కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ రెడీ సిద్దమవుతోంది.  దేశ వ్యాప్తంగా లోక్ సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. వీటితో పాటు జమ్మూ కశ్మీర్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ సిద్ధం చేస్తుంది.