బీజేపీ 14 కమిటీలు.. అసెంబ్లీ ఎన్నికల పోరుకు కమలదళం రెడీ

బీజేపీ 14 కమిటీలు.. అసెంబ్లీ ఎన్నికల పోరుకు కమలదళం రెడీ
  • మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్​గా వివేక్ వెంకటస్వామి
  • పబ్లిక్ మీటింగ్స్​ కమిటీ చైర్మన్ గా బండి సంజయ్
  • పోరాటాల కమిటీ చైర్​పర్సన్​గా విజయశాంతి
  • స్క్రీనింగ్ కమిటీ చైర్మన్​గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 
  • చార్జ్​షీట్​, సోషల్​ మీడియా, మీడియా తదితర కమిటీల నియామకం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ ఎలక్షన్ స్పీడ్​ను పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతస్థాయిలో ప్రచారం చేసేందుకు, పార్టీ విధానాలను జనంలోకి తీసుకు వెళ్లేందుకు వీలుగా ఆ పార్టీ హైకమాండ్ గురువారం ఏకంగా 14 కమిటీలను నియమించింది. ఒక్కో కమిటీకి చైర్మన్ ను, కన్వీనర్  ను నియమించింది. కొన్ని కమిటీలకు జాయింట్​ కన్వీనర్లను కూడా ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అనుమతితో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ కమిటీలను ప్రకటించారు. ఇందులో మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీకి చైర్మన్​గా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామిని హైకమాండ్​ నియమించింది. పబ్లిక్​ మీటింగ్స్​ కమిటీ చైర్మన్​గా ఎంపీ బండి సంజయ్​కు, సోషల్​ మీడియా కమిటీ చైర్మన్​గా ఎంపీ ధర్మపురి అర్వింద్​కు, మీడియా కమిటీ చైర్మన్​గా ఎమ్మెల్యే రఘునందన్​రావుకు, పోరాటాల కమిటీ చైర్​పర్సన్​గా మాజీ ఎంపీ విజయశాంతికి, స్క్రీనింగ్​ కమిటీ చైర్మన్​గా కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. 

ఇవీ 14 కమిటీలు :

మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ:

చైర్మన్: మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, 
కన్వీనర్: మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి,
జాయింట్ కన్వీనర్: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. 

సోషల్ ఔట్ రీచ్ కమిటీ:

చైర్మన్​: ఎంపీ లక్ష్మణ్ , 
కన్వీనర్: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ . 

పబ్లిక్ మీటింగ్స్​ కమిటీ:

చైర్మన్: ఎంపీ బండి సంజయ్, కన్వీనర్: ప్రేమేందర్ రెడ్డి, 
జాయింట్ కన్వీనర్: కాసం వెంకటేశ్వర్లు.

ఇన్​ఫ్ల్యూయెన్సర్ ఔట్ రీచ్  కమిటీ:

చైర్​పర్సన్​: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, 
కన్వీనర్: మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. 

చార్జ్​షీట్​ కమిటీ: 

చైర్మన్​: బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్​చార్జ్​ మురళీధర్ రావు,
కన్వీనర్: మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, 
జాయింట్ కన్వీనర్లు: మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రామచంద్రుడు.

స్క్రీనింగ్ కమిటీ:

చైర్మన్: మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 
కన్వీనర్: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్​. 

పోరాటాల కమిటీ:

చైర్​పర్సన్: మాజీ ఎంపీ విజయశాంతి,
కన్వీనర్: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి. 

సోషల్ మీడియా కమిటీ:

చైర్మన్: ఎంపీ ధర్మపురి అర్వింద్​, 
కన్వీనర్: పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి. 

ఎలక్షన్ కమిషన్ ఇష్యూల కమిటీ: 

చైర్మన్: మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి,  
కన్వీనర్: మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్. 

హెడ్ క్వార్టర్స్ కో ఆర్డినేషన్ కమిటీ: 

చైర్మన్: మాజీ ఎమ్మెల్యే ఎన్.ఇంద్రసేనా రెడ్డి, 
కన్వీనర్: బంగారు శృతి. 

మీడియా కమిటీ:

చైర్మన్: ఎమ్మెల్యే రఘునందన్ రావు, 
కన్వీనర్: మాజీ ఎమ్మెల్సీ  రాంచందర్ రావు, 
జాయింట్ కన్వీనర్: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి. 

క్యాంపెయిన్ ఇష్యూస్, టాకింగ్ పాయింట్స్ కమిటీ:

చైర్మన్ : వెదిరె శ్రీరాం, కన్వీనర్ : మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ . 

ఎస్సీ నియోజకవర్గాల కో ఆర్డినేషన్ కమిటీ:

చైర్మన్​: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, 
కన్వీనర్ : మాజీ మంత్రి విజయరామారావు. 

ఎస్టీ నియోజకవర్గాల కో ఆర్డినేషన్ కమిటీ: 

చైర్మన్ : మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, కన్వీనర్: ఎంపీ సోయం బాపూరావు, జాయింట్ కన్వీనర్ : మాజీ మంత్రి రవీంద్ర నాయక్​.