ప్రజా సమస్యలపై జనసేనతో కలసి పోరాటం చేస్తాం: బండి సంజ‌య్

ప్రజా సమస్యలపై జనసేనతో కలసి పోరాటం చేస్తాం: బండి సంజ‌య్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్‌లోని పవన్‌ నివాసంలో సోమవారం సాయంత్రం సమావేశం అయ్యారు. భేటీ అనంత‌రం సంజ‌య్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ లో మాదిరిగా తెలంగాణ లో కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి ప‌ని చేస్తామ‌ని చెప్పారు. ప్ర‌స్తుత‌ రాష్ట్ర రాజకీయాలపై, పోతిరెడ్డపాడు పై చర్చించామ‌ని చెప్పారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై జనసేనతో కలసి పోరాటం చేస్తామ‌ని చెప్పారు.

తెలంగాణ ను ఇస్లాం రాజ్యంగా మార్చాలని కేసీఆర్.. ఏపీని క్రైస్తవ రాజ్యాంగా మార్చాలని జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు‌. అయోద్య రామమందిరాన్ని రక్షించుకున్నట్లే తిరుపతిని కాపాడుకుంటామ‌ని, బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే తిరుమలను కాపాడుకోవటం పెద్ద కష్టం కాదని అన్నారు. ఇతర మతాల ప్రార్థన మందిరాల జోలికి వెళ్ళే దమ్ము జగన్ కు ఉందా? హిందు వులు గర్జిస్తే కేసీఆర్, జగన్ లు పారిపోతారని అన్నారు. తిరుమలను కాపాడుకోవటానికి జెండాలు పక్కన పెట్టి హిందువులంతా ముందుకురావాలన్నారు. తిరుమల ఆస్తులను కాపాడటానికి మాత్రమే కమిటీలు వేయాలి కానీ.. అమ్మటానికి కాదని అన్నారు

జనసేన అధినేత పవన్ మాట్లాడుతూ.. తెలంగాణలో కూడా బీజేపీతో కలసి పనిచేస్తామని చెప్పారు. దేశ అభివృద్ధి కోసం బీజేపీతో కలసి పనిచేస్తున్నామని పవన్ అన్నారు.