ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ సొమ్ము దోచుకున్నరు : కృష్ణసాగర్ రావు

ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ సొమ్ము దోచుకున్నరు : కృష్ణసాగర్ రావు

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్​కనుసన్నల్లోనే ఆర్టీసీ కార్మికుల పీఎఫ్​ డబ్బులను ప్రభుత్వం దోచుకుందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్​రావు అన్నారు. పీఎఫ్ ​డిపాజిట్ చేయనందున సర్కారుపై కార్మికులు కేసు పెట్టాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఆర్టీసీకి ఫుల్​టైం ఎండీ లేకపోవడం వల్లే రూ. 1000 కోట్ల పీఎఫ్​డబ్బులు దారి మళ్లాయన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటికే నలుగురు ఆర్టీసీ కార్మికులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెలో ఉన్న కార్మికులకు వైద్య సేవలు నిలిపేయడం సరికాదన్నారు. సీఎం ఎత్తులు జిత్తులకు టీజీవో, టీఎన్​జీవో చిక్కవద్దన్నారు.