రెండో విడతలో 2లక్షల50వేల ఇందిరమ్మ ఇండ్లు..హైదరాబాద్ లో లక్ష ఇండ్లు

 రెండో విడతలో 2లక్షల50వేల ఇందిరమ్మ ఇండ్లు..హైదరాబాద్ లో లక్ష ఇండ్లు
  • గుడిసెల్లో ఉంటున్న15 వేల కుటుంబాలకు ఈ విడతలోనే ఇండ్లు
  • జూన్ 2 నాటికి లక్ష ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు
  • గతంలో ప్రారంభించి మధ్యలో నిలిచిపోయిన ఇండ్లకూ నిధులు
  • జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి మంత్రివర్గం ఓకే 
  • క్వాలిటీ కరెంట్​ కోసం ఆర్డీఎస్ఎస్ పథకంలో చేరిక
  • పాలమూరు-రంగారెడ్డి భూసేకరణకు రూ. 587 కోట్లు
  • గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం రూ. వెయ్యి కోట్లు 
  • డీసీఎంఎస్‌‌‌‌లు ‌‌‌‌మార్క్‌‌‌‌ఫెడ్‌‌‌‌లో, హాకాలో  టీఆర్ఐసీ విలీనం
  • కేబినెట్​ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు

హైదరాబాద్ , వెలుగు: రెండో విడతలో 2 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇండ్లను కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిర‌‌‌‌మ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించి.. గోడ‌‌‌‌లు, శ్లాబు ద‌‌‌‌శ‌‌‌‌లో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. హైద‌‌‌‌రాబాద్ మ‌‌‌‌హాన‌‌‌‌గ‌‌‌‌రం క్యూర్ ప‌‌‌‌రిధిలోని 24 నియోజ‌‌‌‌క‌‌‌‌వ‌‌‌‌ర్గాల్లో అల్పాదాయ వ‌‌‌‌ర్గాల వారి కోసం ల‌‌‌‌క్ష ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.  

శనివారం సెక్రటేరియెట్‌‌‌‌లో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అధ్యక్షతన 3.30 గంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.  రాష్ట్రంలో విద్యుత్ సరఫరా లైన్లను మెరుగుపరచడం, రైతులకు, పరిశ్రమలకు, గృహాలకు నాణ్యమైన కరెంట్ అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్డీఎస్ఎస్ పథకంలో తెలంగాణ చేరాలని నిర్ణయించారు.  

మొదటి విడతగా పాలమూరు-–రంగారెడ్డికి రూ. 587 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు గోదావరి పుష్కరాల  కోసం రూ. వెయ్యి కోట్ల నిధులు, జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మధ్యలో నిలిచిన ఇండ్లకూ నిధులు

గత ప్రభుత్వంలో పునాదులు పూర్తయి గోడ‌‌లు, శ్లాబు ప‌‌డ‌‌ని ఇందిరమ్మ ఇండ్లకు రూ.3 ల‌‌క్షలు, గోడ‌‌లు పూర్తై శ్లాబు నిలిచిపోయిన డబుల్ ఇండ్లకు రూ.2 లక్షల చొప్పున సాయం అందిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసేందుకు నియోజ‌‌క‌‌వ‌‌ర్గానికి 500 ఇండ్లకు నిధులు కేటాయిస్తూ కేబినెట్  తీర్మానించిందని చెప్పారు. తొలి విడ‌‌త‌‌లో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్లలో జూన్ 2 నాటికి దాదాపు ల‌‌క్ష ఇండ్ల  గృహ ప్రవేశాలు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.  కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెర‌‌మెరి మండ‌‌లం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీల‌‌కు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిర‌‌మ్మ ఇండ్లను జూన్ 1న ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించినట్టు చెప్పారు. జూన్ 1న సీఎం  రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులందరం అక్కడికి వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు. 

అన్ని రాష్ట్రాల్లాగే ఆర్డీఎస్‌‌ఎస్‌‌ స్కీమ్‌‌లో..

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆర్డీఎస్ఎస్  పథకంలో చేరాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి తెలిపారు. ఇది ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని, 2017 జనవరి 2న  కేంద్ర విద్యుత్ శాఖ, బీఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రభుత్వం, టీఎస్‌‌ఎస్పీడీసీఎల్ మధ్య ‘ట్రైపార్టీ అగ్రిమెంట్’ (త్రైపాక్షిక ఒప్పందం) జరిగిందని వెల్లడించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి దీనిపై రెండు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించారని గుర్తుచేశారు. నాడు గత ప్రభుత్వమే ఈ ఒప్పందంపై సంతకాలు చేసి పక్కన పెట్టిందని, ఆ ఒప్పందంలో మీటర్ల ప్రస్తావన తెచ్చింది కూడా వారేనని మండిపడ్డారు. ప్రస్తుత తమ నిర్ణయంలో ఎక్కడా మీటర్ల ప్రసక్తి రాదని, కేవలం విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసి మెరుగైన కరెంట్ ఇవ్వడానికే ఇందులో చేరుతున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. మరికొన్ని పెండింగ్ అంశాలపై త్వరలోనే మరోసారి కేబినెట్ సమావేశమై తగిన నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు .

పాలమూరు-రంగారెడ్డికి రూ. 587 కోట్లు.. సంస్థల విలీనం

వెనుకబడిన మహబూబ్‌‌నగర్, రంగారెడ్డి జిల్లాల రూపురేఖలు మార్చే పాలమూరు-–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 21 భాగాలుగా విభజించి, కేవలం 18 భాగాలపైనే దృష్టి పెట్టి సగం పనులు చేసి వదిలేసిందని విమర్శించారు. మిగిలిన బ్యాలెన్స్ పనులతోపాటు చివరి ఆయకట్టు అయిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు భూసేకరణ (ల్యాండ్ ఎక్విజిషన్) పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. దీనికోసం మొదటి విడతగా రూ. 587 కోట్ల నిధులను కేబినెట్ మంజూరు చేసిందని తెలిపారు.

టాప్‌‌ 5 లైఫ్‌‌ సైన్సెస్‌‌ హబ్‌‌లలో ఒకటిగా తెలంగాణ

తెలంగాణను 2030 నాటికి ప్రపంచంలోని టాప్‌‌ 5 లైఫ్‌‌ సైన్సెస్‌‌ హబ్‌‌లలో ఒకటిగా నిలబెట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని మంత్రి పొంగులేటి తెలిపారు. అందుకే ‘నెక్స్ట్‌‌ జనరేషన్‌‌ లైఫ్‌‌ సైన్సెస్‌‌ పాలసీ 2026–30’ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని చెప్పారు. దావోస్‌‌లో ఈ పాలసీని లాంఛనంగా ఆవిష్కరించినట్టు తెలిపారు. ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేండ్లలో 5 లక్షల ఉద్యోగాలతోపాటు  25 బిలియన్‌‌ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలనిది లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. లైఫ్‌‌ సైన్సెస్‌‌, ఫార్మా, బయోటెక్‌‌, మెడికల్‌‌ ఇన్నోవేషన్‌‌ రంగాల్లో భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామన్నారు. యువతకు పరిశోధన, తయారీ, డిజిటల్‌‌ హెల్త్‌‌, గ్లోబల్‌‌ ఇన్నోవేషన్‌‌ రంగాల్లో మంచి అవకాశాలు కల్పించనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు ఎక్కువగా తయారీ మీద దృష్టి ఉంటే, ఇక నుంచి విలువైన ఇన్నోవేషన్‌‌ మీద ఎక్కువ ఫోకస్‌‌ పెడతామన్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్‌‌ యూనిట్లను కూడా పరిశ్రమలుగా గుర్తించే విధంగా ఈ పాలసీలో మార్పు తీసుకొస్తున్నామని తెలిపారు. గ్లోబల్‌‌ కేపబిలి టీ సెంటర్లు, గ్లోబల్‌‌ ఇన్నోవేషన్‌‌ సెంటర్లు తెలంగాణకు రావడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందన్నారు. 

కరీంనగర్ జిల్లాలో కేంద్ర బలగాల గ్రూప్ సెంటర్ 

కరీంనగర్‌‌‌‌లో అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్​, సీఐఎస్ఎఫ్‌‌లాంటి కేంద్ర పారా మిలటరీ బలగాలకు సంబంధించిన గ్రూప్ సెంటర్‌‌‌‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మానకొండూరు మండలం వెల్దిలో 4 ఎకరాలు, చొప్పదండి మండలం రుక్మాపూర్‌‌‌‌లో 5 ఎకరాలు, గన్నేరువరంలో 5 ఎకరాలు కలిపి మొత్తం 14 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ  రాష్ట్ర కేబినెట్  తీర్మానించింది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌‌‌‌లో పారామిలటరీ బలగాల గ్రూప్ సెంటర్ ఏర్పాటుపై మరో అడుగు ముందుకు పడ్డట్లయింది. త్వరలోనే కేంద్రం గ్రూప్ సెంటర్ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోనుంది.

 అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ బలగాల గ్రూప్ సెంటర్ ఏర్పాటు కోసం కరీంనగర్ జిల్లాలో తగినంత స్థలం కేటాయించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మార్చి 10న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే సీఎస్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను సీసీఎల్ఏకు పంపారు. సీసీఎల్ఏ ఆయా ప్రతిపాదనలను పరిశీలించి రాష్ట్ర కేబినెట్‌‌కు పంపగా ఆమోదం లభించింది.

మరిన్ని కేబినెట్‌‌ నిర్ణయాలివే..

రాష్ట్రంలో వివిధ ద‌‌ఫాలుగా చేసిన స‌‌ర్వేల ప్రకారం 15 వేల కుటుంబాలు గుడిసెల్లో నివాసం ఉంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వెంట‌‌నే ఆ కుటుంబాల‌‌న్నింటికీ ఇందిర‌‌మ్మ ఇండ్ల మంజూరు ప‌‌త్రాలు అందించాల‌‌ని కేబినెట్ తీర్మానించింది. గుడిసె లులేని ఆద‌‌ర్శ రాష్ట్రంగా తెలంగాణ‌‌ను నిల‌‌పాల‌‌ని నిర్ణయించింది.  

  • రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేం దుకు ఆమోదం తెలిపింది.     
  • ప్రభుత్వ పాఠశాలలతో పాటు అన్ని జూని యర్ కళాశాలల్లో విద్యార్థులకూ ఉదయం అల్పాహారంతోపాటు పాలు అందించాల‌‌ని నిర్ణయించింది.
  • రాష్ట్రంలోని డీసీఎంఎస్‌‌లను  మార్క్‌‌ఫెడ్‌‌లో, తెలంగాణ రూర‌‌ల్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ కార్పొరేష‌‌న్‌‌ను హాకాలో విలీనం చేయాల‌‌ని కేబినెట్ నిర్ణయించింది.